బద్వేలు:
మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, అనంతరం సజీవ దహనం చేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో కడప కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.8,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితురాలి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిడమైనది. వై.యస్.ఆర్. కడప జిల్లా బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 231/2024, బి ఎల్ ఎస్ -2023 సెక్షన్లు 64, 103, 303(2), 238 మరియు చట్టం-2012 సెక్షన్ 3 r/w 4 కింద నమోదైన కేసులో దర్యాప్తు అధికారుల సమర్థవంతమైన దర్యాప్తు, సాంకేతిక ఆధారాల సేకరణ మరియు పకడ్బందీ ప్రాసిక్యూషన్ ఫలితంగా నిందితుడిపై నేరం రుజువైంది.
కడప కోర్టు న్యాయమూర్తి ఎం.ఎ. సోమశేఖర్ సెక్షన్ 258(2) ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్రూ.8,000/- జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
➡
కేసు పూర్వాపరాలు:
నిందితుడు జక్కల విగ్నేష్ అలియాస్ సాయి (19) ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.పి. కుంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం సజీవ దహనం చేసి హత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మృతి చెందింది.
కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అప్పటి బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగభూషణం సాంకేతిక ఆధారాలను సేకరించి, కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేశారు. నిందితుడిని 30 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి, పకడ్బందీగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
=============================

