ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeజాతియంటీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.

టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.

📰 Generate e-Paper Clip

కోల్ కత్తా, సెప్టెంబర్ 19,అర్జున్ సమాచారం:
త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రితబ్రత బెనర్జీ వర్గానికి ఎన్నికల సంఘం (EC) కొత్త పేర్లను ప్రకటించింది. మమతా బెనర్జీ పార్టీకి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు కేటాయించింది. టీఎంసీ తిరుగుబాటు వర్గం రితబ్రత వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు కేటాయించింది ఈసీ. ఎన్నికల సంఘం 2 పార్టీలకు వేర్వేరు ఎన్నికల చిహ్నాలను కూడా కేటాయించింది. మమతా పార్టీకి ఫుట్‌బాల్ ప్లేయర్, రితబ్రత పార్టీకి ఎన్వెలప్ కవర్ లను ఎన్నికల చిహ్నంగా ప్రకటించింది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత TMCలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీఎంసీ పార్టీ ముక్కలైంది. తరువాత మాదే అసలైన టీఎంసీ అంటూ మమతా, రితబ్రత వర్గాలు పోటీ పడ్డాయి. పార్టీలో గొడవ సద్దుమణగకపోవడంతో విషయం ఎన్నికల సంఘం వరకు చేరింది. అనంతరం ఈసీ TMC పేరు, చిహ్నాన్ని మొదట ఫ్రీజ్ చేసింది. ఎవరూ ఆ గుర్తు, పేరు వాడకూడదని మొదట హెచ్చరించింది. తాజాగా ఎన్నికల కమిషన్ రెండు వర్గాలకు కొత్త పేరు, లోగోలను కేటాయించింది. అయితే ఇది ప్రస్తుతానికేనని, త్వరలో పూర్తి స్థాయి ఆదేశాలు వచ్చే వరకు ఇదే కొనసాగనున్నాయి.
ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’కు సంబంధించిన వివాదంలో ఉన్న రెండు పక్షాలకు ఎన్నికల కమిషన్ ప్రస్తుతం పార్టీ పేరు, గుర్తును కేటాయించింది. రాబోయే బెంగాల్ ఉపఎన్నికల కోసం పార్టీలు ఇదే పేరు, గుర్తుతో బరిలోకి దిగాలని ఆదేశాలలో పేర్కొంది. మొన్నటివరకూ ఉన్న ‘రెండు పువ్వులు, గడ్డి’ ఎన్నికల చిహ్నాన్ని ఉపయోగించవద్దని ఇరు వర్గాలను ఆదేశించింది. శుక్రవారం ఉదయం వరకు తమకు నచ్చిన పేరు, ఎన్నికల చిహ్నాన్ని తెలియజేయాలని ఈసీ కోరింది.
ఈసీ సూచన మేరకు ప్రతిపాదిత పేరు ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ తరహాలో ఉండవచ్చని, అలాగే ఎన్నికల చిహ్నాన్ని స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపు లేని రాజకీయ పార్టీల కోసం నోటిఫై చేయని ఖాళీ లేదా అందుబాటులో ఉన్న ఎన్నికల చిహ్నాల జాబితా నుంచి ఎంచుకోవాలని ఈసీ తెలిపింది. ఈ క్రమంలో మమతా బెనర్జీ, రితబ్రత వర్గాలు తమ కోరుకున్న పేరు, గుర్తులను మూడేసి చొప్పున ఈసీకి తెలిపాయి. వీటి నుంచి ఈసీ రెండు టీఎంసీ వర్గాలకు పేరుతో పాటు పార్టీ గుర్తును కేటాయించింది. రేజీనగర్, నందిగ్రామ్‌లో అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరగనున్నాయి.
=================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!