మంచిర్యాల జిల్లా టీఆల్ స్ఏ అధ్యక్షుడిగా ముక్త సంతోష్ కుమార్ నియామకం.
అర్జున సమాచారం చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 20:
తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ టీఆల్ స్ఏ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ముక్త సంతోష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు టీఆల్ స్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు కె. బాలు నాయక్ ఆయనకు అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు
ఈ నియామకంతో మంచిర్యాల జిల్లాలో టీఆల్ స్ఏ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని సంస్థ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, వారి హక్కులు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడమే టీఆల్ స్ఏ ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు
నియామక పత్రం అందుకున్న అనంతరం ముక్త సంతోష్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన టీఆల్ స్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు కె. బాలు నాయక్ తో పాటు రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా న్యాయ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, ఉచిత న్యాయ సహాయ శిబిరాలు ఏర్పాటు చేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో న్యాయ విద్యార్థులను భాగస్వాములను చేయడం తన ప్రాధాన్యతగా ఉంటుందని పేర్కొన్నారు
అదేవిధంగా న్యాయ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యాపరమైన, వసతి పరమైన సమస్యలను గుర్తించి వాటిని సంబంధిత అధికారులు, ప్రభుత్వ వర్గాల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. సంస్థ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేసి టీఆల్ స్ఏ ను జిల్లాలో మరింత బలోపేతం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు
ఈ సందర్భంగా టీఆల్ స్ఏ నాయకులు, సభ్యులు ముక్త సంతోష్ కుమార్ కు ఘనంగా అభినందనలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని, జిల్లాలో న్యాయ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని ఆకాంక్షించారు.

