ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
చెన్నూర్ ,(అర్జున సమాచారం సెప్టెంబర్ 21) :
శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వినాయక నిమజ్జన వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. విద్యార్థులు భక్తి పాటలు, నినాదాలతో ఉత్సాహంగా పాల్గొనగా, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది సహకరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
విద్యార్థుల ఉత్సాహం, తల్లిదండ్రుల సహకారం, పాఠశాల సిబ్బంది భాగస్వామ్యంతో నిమజ్జన వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

