“మీకు దండం పెడతాం సార్.. మాకు తాగునీరు అందేలా చేయండి” అంటూ గ్రామస్థుల వేడుకోలు,
మంచిర్యాల.అర్జున్ సమాచారం సెప్టెంబర్ 21బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.
కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీరు, డ్రైనేజీ మరియు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రక్షణ సేన కాసిపేట మండల ఇంచార్జి సోదరి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
గ్రామంలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, మురుగునీరు ఇళ్ల పరిసరాల్లో నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. దోమల బెడద కారణంగా ఇళ్లలో డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దోమల నివారణ చర్యలు, ఫాగింగ్, మురుగునీటి తొలగింపు చేపట్టాలని అధికారులను కోరారు.
అదేవిధంగా గ్రామంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. “మీకు దండం పెడతాం సార్.. మాకు తాగునీరు అందేలా చేయండి” అంటూ గ్రామస్థులు తమ ఆవేదనను అధికారులను వేడుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పెద్ద ధర్మారంలో తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు గంగాధరి రాజ్ కుమార్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

