బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో వీడియో కలకలం
హైదరాబాద్: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 22.
బండ్లటూడ ఆర్టీవో కార్యాలయంలో ఒక వీడియో కలకలం రేపింది. ఆర్టీవో O కార్యాలయంలో ముడుపుల భాగోతాన్ని బట్టబయలు చేసింది. భారీగా నగదు లెక్కిస్తున్న కానిస్టేబుల్ వీడియో వైరల్ అయింది. అన్ని డాక్యుమెంట్లు ఉన్న వాహనదారులను తిప్పుతున్న వైనం ఇక్కడ సాధారణమే. మధ్యవర్తుల ద్వారా వెళ్తేనే వేగంగా పనులు జరుగుతాయి. నగదు ఎవరిదని దానిపై సమాధానం రావడంలేదు. బాధితులే స్వయంగా వీడియోలు తీసి పోస్ట్ చేసినట్లు అనుమానం.

