ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పిఠాపురంలో పవన్ మార్క్.

పిఠాపురంలో పవన్ మార్క్.

📰 Generate e-Paper Clip

పిఠాపురంలో పవన్ మార్క్.

కాకినాడ సెప్టెంబర్ 23, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 23.)

డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసును పిఠాపురానికి మార్చాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు తన వద్దకు సమస్యల పరిష్కారం కోసం వస్తున్న ప్రజల అర్జీలను స్వీకరించడానికి, స్థానిక సమస్యలను నేరుగా పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్‌నే పిఠాపురానికి తరలించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.తన పర్యటనల్లో అనేకమంది ప్రజలు వినతిపత్రాలు చేతుల్లో పట్టుకుని కిలోమీటర్ల మేర నిలబడుతుండటం తనను తీవ్రంగా ఆలోచింపజేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు , వారి వినతులను స్వీకరించేందుకు జనసేన తరఫున ఒక ప్రతినిధి కమిటీని నియమించినప్పటికీ, ఆ కమిటీ బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన, ఇకపై బాధ్యతలను నేరుగా తమ ప్రభుత్వ యంత్రాంగమే చూసుకుంటుందని స్పష్టం చేశారు.స్థానిక నాయకత్వం , కమిటీ పనితీరు సరిగా లేకపోవడంతో, తానే స్వయంగా ప్రజా సమస్యలను పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ పేర్కొన్నారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ సేవలను పిఠాపురానికి విస్తరించడం, ఇక్కడి నుంచే నిర్వహించేలా మార్పులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. పూర్తిస్థాయి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత స్థానిక పాలన, ప్రజా అర్జీల స్వీకరణ అంతా పిఠాపురం నుంచే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి పనులతో పాటు ప్రజల వ్యక్తిగత, సామాజిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నిర్ణయంతో పిఠాపురం నియోజకవర్గం త్వరలోనే రాష్ట్ర రాజకీయాలకు , పాలనకు కేంద్రబిందువుగా మారనుంది.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీకి అవసరమైన మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ , ఆధునిక సదుపాయాల సమకూర్చే దిశగా దాదాపు రూ. 1,500 కోట్ల వ్యయంతో బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిఠాపురం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పాలనాపరమైన, ఆర్థికపరమైన సంస్కరణలను వేగవంతం చేస్తున్నారు.ప్రత్యేకించి నియోజకవర్గంలో భూగర్భ జలాల పునరుద్ధరణ, గ్రామీణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువుల సుందరీకరణకు పవన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఫకృద్ధీన్ పాలెంలో మైసమ్మ చెరువును రూ. 73 లక్షలతో సుందరీకరించి వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్ వంటి వసతులతో గ్రామ ప్రజలకు ఆహ్లాదకర కేంద్రంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 6 కోట్లకు పైగా వ్యయంతో 14 చెరువులను ఆధునీకరించి, గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభను తీసుకువస్తున్నారు.పట్టణ పర్యావరణం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ రహదారికి సమీపంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.1.83 కోట్ల వ్యయంతో పీఠికాపుర వనం పట్టణ అటవీ ప్రాజెక్టును ఆవిష్కరించారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ఏర్పాటు, పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ, మోడల్ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నారు. పిఠాపురం పుణ్యక్షేత్రమైనందున పర్యాటకాభివృద్ధికి సైతం పెద్దపీట వేస్తున్నారు.అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు , పరిపాలనా వేగాన్ని పెంచేందుకు పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కి స్వయంప్రతిపత్తి హోదాను కల్పించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఈ సంస్థ ద్వారా ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులు, ఆర్థిక వృద్ధి , ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ చొరవలతో పిఠాపురం రూపురేఖలు వేగంగా మారుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!