ePaper
Wednesday, November 11, 2026
ePaper
Homeతెలంగాణకులవివక్ష వ్యాఖ్యలపై సర్పంచ్ కుటుంబానికి మద్దతుగా ధర్నా.

కులవివక్ష వ్యాఖ్యలపై సర్పంచ్ కుటుంబానికి మద్దతుగా ధర్నా.

📰 Generate e-Paper Clip

కులవివక్ష వ్యాఖ్యలపై సర్పంచ్ కుటుంబానికి మద్దతుగా ధర్నా.

సర్పంచ్ కుటుంబాన్ని కులం పేరుతో దూషించారనే ఆరోపణలు.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్.

మంథని:అర్జున్ సమాచారం, ప్రతినిధి నవంబర్ 9:

పుట్టపాక గ్రామ సర్పంచ్ ,కన్నూరు రాజబాబు కుటుంబాన్ని కులం పేరుతో దూషిస్తూ, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బాధిత కుటుంబానికి మద్దతుగా పుట్టపాకలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నగరంపల్లెకు చెందిన పోరెడ్డి తిరుపతిరెడ్డి. కులవివక్షతో కూడిన, అభ్యంతరకరమైన పదజాలంతో సర్పంచ్ కుటుంబాన్ని అవమానించారని ఆరోపిస్తూ సంబంధిత సామాజిక వర్గానికి చెందిన పలువురు ఈ ఆందోళన చేపట్టారు.

సోమవారం మధ్యాహ్నం సుమారు 2. గంటల సమయంలో నిర్వహించిన ఈ ధర్నాలో కులం పేరుతో దూషించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. సమాజంలో కులవివక్షకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

ఈ ధర్నా కార్యక్రమానికి శ్రీశైలం నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ, కులం పేరుతో వ్యక్తులను, వారి కుటుంబాలను కించపరిచే విధంగా మాట్లాడటం సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అధికారులు తేలికగా తీసుకోకుండా సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
ధర్నా నేపథ్యంలో ఏసీపీ మడత రమేష్ ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ ఘటనపై న్యాయం జరిగేలా చూస్తానని, సంబంధిత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏసీపీ ఇచ్చిన హామీతో ఆందోళనకారులు కొంతమేర శాంతించారు.

కులవివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ధర్నాలో పాల్గొన్న వారు కోరారు. కుల వివక్షకు తావులేకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!