ePaper
Thursday, November 12, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్నిమజ్జన వేడుకల భద్రత కోసం హైదరాబాద్‌లో 20 వేల మంది పోలీసులు, ఇతర జిల్లాల్లో 8,400...

నిమజ్జన వేడుకల భద్రత కోసం హైదరాబాద్‌లో 20 వేల మంది పోలీసులు, ఇతర జిల్లాల్లో 8,400 మంది సిబ్బంది పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విభాగాల ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నిమజ్జన ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గణేశ్‌ వేడుకలకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్‌ వీడియోలు వైరల్ చేస్తున్నారని, పాత లేదా నకిలీ వీడియోలను పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా గణేశ్‌ మండపాల వద్ద అసభ్యకరమైన వల్గర్‌ పాటలు మరియు డ్యాన్స్‌లపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.
నిమజ్జన వేడుకల భద్రత కోసం హైదరాబాద్‌లో 20 వేల మంది పోలీసులు, ఇతర జిల్లాల్లో 8,400 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని సీపీ తెలిపారు. ఖైరతాబాద్‌ మరియు బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్రకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల పర్యవేక్షణ కోసం ఈసారి ఏఐ (Artificial Intelligence) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. శోభాయాత్ర పరిశీలనకు 24 డ్రోన్లను వాడుతుండగా, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు 10 వేల సీసీ కెమెరాలను అనుసంధానించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 100 హైరైజ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.
నిమజ్జన విధుల్లో 25 క్రైమ్ విభాగాల టీమ్‌లు పనిచేస్తాయని, చైన్‌ స్నాచింగ్‌లు, ఇతర చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. అలాగే మహిళల రక్షణ కోసం షీటీమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. నిమజ్జన వేడుకల్లో డీజేల వినియోగంపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ దర్శనానికి ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎల్లుండి ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈనెల 25న ప్రైవేటు బస్సులు, ఇతర ప్రైవేటు ట్రక్కులకు నగరంలోకి ప్రవేశం ఉండదని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!