రంగారెడ్డి,అర్జున్ సమాచారం:
బాలాపూర్‌లో కొలువుదీరిన గణనాథుడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కేటీఆర్‌తో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, తలసాని సాయి కిరణ్ యాదవ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
అదే సమయంలో “తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
==========================

