ePaper
Friday, November 13, 2026
ePaper
Homeరామగుండంసివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన... కేటీఆర్ కోల సింధు...

సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన… కేటీఆర్ కోల సింధు రచనా ప్రతిభను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

📰 Generate e-Paper Clip

గోదావరిఖని:
అర్జున్ సమాచారం:
రామగుండం నియోజకవర్గం వేమునూర్ గ్రామ సర్పంచ్ కోల లత గారి కోడలు, కోల మహేష్ – లక్ష్మీ దంపతుల కుమార్తె, సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన “ అండ్ డిఫైనేబుల్ గర్ల్” (Un Definable Girl) పుస్తకాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)  చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్, కోల సింధు రచించిన పుస్తకాన్ని అభినందిస్తూ, ఆమె రచనా ప్రతిభను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రతిష్టాత్మకమైన ఆలిండియా సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.చిన్న వయసులోనే రచనా రంగంలో ప్రతిభను చాటుతూ, సివిల్స్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న కోల సింధు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామగుండం నియోజకవర్గానికి చెందిన వ్యాల్ల హరీష్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!