పటాన్చెరు:అర్జున్ సమాచారం:
పీఎఫ్ కార్యాలయాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం పటాన్చెరు లో పీఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం ఉన్న భవనం నుంచి పటాన్చెరు బస్టాండ్ లోకి నూతన కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని,అక్కడ పనులు పూర్తయ్యే వరకు మాత్రమే ఆన్లైన్ సేవల కోసం కొత్తగూడ లో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.బస్టాండ్ మొదటి,రెండో అంతస్తులో విద్యుత్,ఇంటర్నెట్,పార్టిషన్ తదితర సౌకర్యాలు అందుబాటులో కి రావడానికి మూడు నెలల సమయం పడుతుందని తెలిపారు.ఆ లోపు కార్మికులకు సేవలు నిలిచిపోకుండా కొత్తగూడా లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోనున్నామని తెలిపారు.పటాన్చెరు బస్ స్టాండ్ మొదటి,రెండు అంతస్తుల్లో పనులు పూర్తి కాగానే కొత్త గూడ లో ఉన్న కార్యాలయాన్ని కూడా పటంచేరుకే తరలిస్తామని స్పష్టం చేశారు.అయితే అప్పటివరకు కార్మికులకు బస్టాండ్ లోనే తాత్కాలిక కార్యాలయం అందుబాటులో కి తేవాలని ఎంపీ ఆదేశించడమ్ తో అప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకున్నారు.అనంతరం ఎంపీ అధికారులతో కలిసి పటాన్చెరు బస్ స్టాండ్ లో ఏర్పాటు చేయనున్న నూతన కార్యాలయాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.పీఎఫ్ కార్యాలయం నగరానికి తరలిపోతుందనే అభిప్రాయాన్ని దూరం చేసేందుకు తాను స్వయంగా రావడం జరిగిందని ఎంపీ తెలిపారు.కార్మికులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని హామీ ఇచ్చారు.పీఎఫ్ కార్యాలయం కోసం శాశ్వత భవనం కోసం జిల్లా కలెక్టర్ తో చర్చించి కర్ధనూర్ లో భూమిని కేటాయించాలని ప్రతిపాదించారు
========================

