ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeసినిమాసరికొత్త గేమ్‌తో ‘ది ట్రైటర్స్ తెలుగు’ అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో

సరికొత్త గేమ్‌తో ‘ది ట్రైటర్స్ తెలుగు’ అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’ను తెలుగులోకి తీసుకొస్తున్న ప్రైమ్ వీడియో.. హోస్ట్‌గా తొలిసారి రియాలిటీ షోలోకి హీరో తేజ సజ్జ
20 మంది విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ హై-ఆక్టేన్ షో.. నాలుగు వారాల పాటు 10 ఎపిసోడ్స్‌గా ప్రసారం

ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్స్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రైమ్ వీడియో.. తన అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ ‘ది ట్రైటర్స్ తెలుగు’ వరల్డ్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. నమ్మకం, మైండ్ గేమ్స్, మోసం, హై-స్టేక్స్ డ్రామాతో సాగే ఈ ఆసక్తికరమైన రియాలిటీ గేమ్ షో అక్టోబర్ 15, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
SOL ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌తో అవార్డు గెలుచుకున్న ‘ది ట్రైటర్స్’ ఫార్మాట్ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో ఇప్పటికే రెండు సీజన్లకు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత.. ఈ ఫ్రాంచైజ్‌ను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ హీరో తేజ సజ్జ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తొలిసారి రియాలిటీ హోస్ట్‌గా పరిచయం కానున్నారు.
10 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్‌లో విభిన్న రంగాలకు చెందిన 20 మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇక్కడ నమ్మకం ఒక క్షణంలో బలంగా మారవచ్చు.. మరుసటి క్షణంలో అదే బలహీనతగా మారవచ్చు. తేజ సజ్జ తనదైన స్పాంటేనియిటీ, ఎనర్జీతో ఈ షోకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురానున్నారు.
‘ది ట్రైటర్స్ తెలుగు’ నాలుగు వారాల పాటు తెలుగు భాషలో, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు (IST) కొత్త ఎపిసోడ్స్ విడుదల కానున్నాయి.
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియాలిటీ ఫార్మాట్స్‌లో ‘ది ట్రైటర్స్’ ఒకటి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో స్థానిక వెర్షన్స్‌తో ఈ ఫార్మాట్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రాంచైజ్‌గా ఎదిగింది. ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోకి అడుగుపెడుతున్నప్పటికీ.. గేమ్ రూల్స్ మాత్రం అదే. కానీ ఆటలో ఏం జరుగుతుందనేది మాత్రం పూర్తిగా సస్పెన్స్. దాగి ఉన్న ఐడెంటిటీస్, సీక్రెట్ అలయన్స్‌లు, వ్యూహాత్మక ఎత్తుగడలు, ఊహించని ద్రోహాలు.. కంటెస్టెంట్స్ ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకోగలరో పరీక్షించనున్నాయి. గేమ్‌లోని ‘ఇన్నోసెంట్స్’ తమ మధ్య దాగి ఉన్న ‘ట్రైటర్స్’ ను సమయం మించకముందే గుర్తించాల్సి ఉంటుంది.
డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో (SVOD), అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా నిఖిల్ మాధోక్  మాట్లాడుతూ.. “మైండ్ గేమ్స్, స్ట్రాటజీపై దృష్టి పెట్టడంతో ‘ది ట్రైటర్స్ తెలుగు’ అన్‌స్క్రిప్టెడ్ స్పేస్‌లో నిజంగా ఆసక్తికరమైన, డిఫరెంట్ షోగా నిలుస్తుంది. హిందీలో రెండు అత్యంత విజయవంతమైన సీజన్ల తర్వాత ఈ ఫ్రాంచైజ్‌ను తెలుగులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎడిషన్‌ను లీడ్ చేయడానికి తేజ సజ్జ అద్భుతమైన హోస్ట్. ఆయన చరిష్మా, స్పాంటేనియిటీ, ప్రేక్షకులతో సహజమైన కనెక్షన్ ఈ షోకు ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను తీసుకొస్తాయి. ‘ది ట్రైటర్స్ తెలుగు’ ద్వారా ఈ ఫ్రాంచైజ్‌ను మరింత విస్తరించి, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాం.”
ఫజీలా అల్లానా, పార్ట్‌నర్ అండ్ కో-ఫౌండర్, SOL ప్రొడక్షన్స్ మాట్లాడుతూ.. ది ట్రైటర్స్’ను తెలుగులోకి తీసుకురావడం మాకు ఎంతో ప్రత్యేకమైన అవకాశం. నమ్మకం, ఆశయం, రిలేషన్‌షిప్స్, ద్రోహం వంటి యూనివర్సల్ అంశాలతో కథను చెప్పేందుకు ఈ ఫార్మాట్ మంచి వేదికను అందిస్తుంది. అదే సమయంలో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఉన్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కల్చరల్ ఫ్లేవర్‌ను ఇందులో తీసుకురావాలని కోరుకున్నాం. ప్రపంచాన్ని గ్రాండ్‌గా, ఇమర్సివ్‌గా రూపొందించాలనుకున్నప్పటికీ.. ఇందులో గేమ్ ఆడే వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలే ప్రధానంగా ఉండేలా చూసుకున్నాం. ప్రైమ్ వీడియోతో కలిసి మేము రూపొందించిన ఈ షోపై ఎంతో గర్వంగా ఉన్నాం. గేమ్ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు చర్చించుకుంటూ, అంచనాలు వేస్తూ, తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌ను ఎంచుకుంటారని ఎదురుచూస్తున్నాం.”

Previous article
Next article
వైసీపీ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు 100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి నుంచి.. సొంతంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 6,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0 పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు 22,500 మినీ గోకులాలు.. 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు • కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి భారీ కార్యాచరణ • ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక గ్రామీణ అభివృద్ధి • అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరం ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్ల పల్లెపండుగ 3.0కు శ్రీకారం • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!