కూకట్ పల్లి,అర్జున్ సమాచారం:
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రామ్దేవ్రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్తో పాటు ఉచిత కార్డియాలజీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు వైద్య పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ కార్యక్రమంలో భాగంగా కుముదినీదేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లయన్స్ క్లబ్ ఆఫ్ సనాతన సహకారంతో నిర్వహించిన వాకథాన్ను ప్రముఖ రేకీ థెరపీ గ్రాండ్ మాస్టర్, రచయిత్రి, సామాజిక కార్యకర్త లక్ష్మీ కమలాకర్ ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచించారు.
తరువాత నిర్వహించిన ఉచిత కార్డియాలజీ శిబిరంలో బీపీ, రక్తంలో చక్కెర, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలతో పాటు కార్డియాలజీ వైద్యుల సంప్రదింపులు అందించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన శిబిరంలో 406 మంది ఉచిత వైద్య సేవలను పొందారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, లయన్స్ క్లబ్ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ మార్గదర్శకత్వంలో డా. కమలాకర్, డా. ప్రదీప్ రెడ్డి, డా. యోబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
=======================
గుండె ఆరోగ్యంపై అవగాహన.. రామ్దేవ్రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కార్డియాలజీ వైద్య శిబిరం
RELATED ARTICLES

