ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeతెలంగాణమహబూబ్​నగర్జిల్లా పోలీసు కార్యాలయంలో వయోవృద్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. వనపర్తి.

జిల్లా పోలీసు కార్యాలయంలో వయోవృద్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. వనపర్తి.

📰 Generate e-Paper Clip

వనపర్తి.
అర్జున్ సమాచారం:

అంతర్జాతీయవయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వయోవృద్ధులకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల మోసపూరిత కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. KYC అప్‌డేట్, ఆధార్ అప్‌డేట్ తదితర పేర్లతో ఫోన్ చేసి OTP చెప్పాలని అడగడం, వివిధ రకాల లింకులు పంపించి వాటిని ఓపెన్ చేయమని కోరడం వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, ATM/డెబిట్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు వరకు వివిధ వయస్సుల వారు సైబర్ నేరాలకు గురైన సందర్భాలు ఉన్నందున, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు మరియు అనుమానాస్పద లింకులకు స్పందించకుండా, ముందుగా వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే అనుమానాస్పద సైబర్ నేరాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో DCRB DSP బాలాజీ, DIO రాకేష్ రెడ్డి, DLSA కృష్ణయ్య, CDPO అమృతమ్మ, DWO సూపరింటెండెంట్ అరుంధతి, DWO సుధారాణి పాల్గొన్నారు. అలాగే SI అంజద్ ఆలీ
షీటీం  సైబర్ SI రవి ప్రకాశ్ మరియు సైబర్ టీమ్ పాల్గొని వయోవృద్ధులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.

అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి రక్షణ — OTP చెప్పొద్దు, అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దు.
===================

Previous article
వైసీపీ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం పల్లె పండుగ 1.0, 2.0తో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు 100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థితి నుంచి.. సొంతంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 6,500 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0 పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు 22,500 మినీ గోకులాలు.. 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు • కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి భారీ కార్యాచరణ • ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శక గ్రామీణ అభివృద్ధి • అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరం ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్ల పల్లెపండుగ 3.0కు శ్రీకారం • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!