ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీశైలంశ్రీశైల... దేవస్థానంలో చెంచుగిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

శ్రీశైల… దేవస్థానంలో చెంచుగిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం

📰 Generate e-Paper Clip

శ్రీశైలం…
అర్జున్ సమాచారం:
ప్రతీ నెలలోనూ ఒకరోజున అనగా ప్రతీ నెలలో చివరి బుధవారం రోజున చెంచుగిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగింది.
ఇందులో భాగంగా  259 మంది చెంచు గిరిజన భక్తులకు శ్రీస్వామివార్ల  ఉచిత స్పర్శదర్శనం మరియు అమ్మవారి దర్శనం  కల్పించబడింది.
స్థానిక చెంచుగూడెములతో పాటు నంద్యాల జిల్లా నుంచి 45 మంది,  మార్కాపురం జిల్లాలోని 104 మంది చెంచు భక్తులు,  మాచర్ల నుండి 110 మంది చెంచు గిరిజనులు స్పర్శదర్శనాన్ని చేసుకోవడం జరిగింది.
దర్శనానంతరం చెంచు గిరిజన భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణా ప్రసాదవితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయబడ్డాయి.
కాగా  చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు.  వారికి ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద   సిబ్బంది ఆహ్వానం పలికారు.
శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకోవడం జరిగింది.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!