ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeతెలంగాణఆసిఫాబాద్గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో డీడీ జాదవ్ అంబాజీ ఆకస్మిక తనిఖీ

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో డీడీ జాదవ్ అంబాజీ ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

ఆసిఫాబాద్  సెప్టెంబర్ 30:అర్జున్ సమాచారం:
కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని బాలికల గురుకుల పాఠశాల,కళాశాల లను జిల్లా గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు జాదవ్ అంబాజీ బుధువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థినిల హాజరు, తరగతి గదుల్లో బోధన, వసతి గృహ నిర్వహణ, భోజనశాల, వంటశాల, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, వైద్య సదుపాయాలు, విద్యార్థుల భద్రతా చర్యలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినిలతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలు, ఆరోగ్యం, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం అందేలా ప్రిన్సిపాల్ ,వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బాలికల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్యా సౌకర్యాలు విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం పాఠశాలల్లోని రికార్డులు, విద్యార్థుల హాజరు, వసతి గృహ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి, విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఆకస్మిక తనిఖీల ద్వారా పాఠశాలల నిర్వహణ మరింత మెరుగుపడాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన లక్ష్యమని జాదవ్ అంబాజీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో  గురుకుల పాఠశాల,ప్రిన్సిపాల్ జాదవ్ మహేశ్వరీ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ శ్రీ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!