ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అక్టోబరు 2,అర్జున్ సమాచారం:
తెలంగాణలో ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. వీరి కోసం ప్రత్యేకంగా నిర్వహించే ‘టెట్‌-2’ పరీక్షకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అర్హులైన టీచర్ల నుంచి ఈ అక్టోబర్ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్‌ కమిటీ ఛైర్మన్‌ నవీన్‌ నికోలస్‌ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. టెట్ ఆన్‌లైన్ పరీక్షలను నవంబరు 16 నుంచి 21వ తేదీ వరకు వేర్వేరు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ స్పెషల్ టెట్ ఫలితాలను డిసెంబరు 9 నుంచి 11వ తేదీల మధ్య విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే 2028 ఆగస్టు నాటికి టెట్ ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఇన్‌‌ సర్వీస్‌ టీచర్ల కోసం ఈ స్పెషల్ టెట్ పరీక్షను నిర్వహిస్తోంది.
==================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!