ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeజగిత్యాలజర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన.

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన.

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన.

జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 2:

జగిత్యాల: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఐజేయూ పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాలలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు.

మంచినీళ్ల బావి వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, వేజ్ బోర్డు ఏర్పాటు చేసి వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలని, నిలిపివేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరారు.

పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!