ePaper
Thursday, October 8, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్ఓట్, సీట్ చోరీ పేటెంట్స్ కాంగ్రెస్ వే: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

ఓట్, సీట్ చోరీ పేటెంట్స్ కాంగ్రెస్ వే: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
ఓట్ చోరీ, సీట్ చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ కే ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో మొట్టమొదటి ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని చెప్పారు. 1946లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటీష్ పాలకులు కాంగ్రెస్ కోరిన సమయంలో దేశంలోని ప్రదేశ కాంగ్రెస్ కమిటీలన్నీ తొలి ప్రధాని అభ్యర్ధిగా  పటేల్ పేరు ప్రతిపాదిస్తూ ఓట్లేస్తే ఒక్క పీసీసీ మద్దతు కూడా నెహ్రూను ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ దేనని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి ఓట్, సీట్ చోరీకి పాల్పడాల్సిన కర్మ లేనేలేదన్నారు. ఆయనకు  కుటంబమే లేదని, బ్యాంకు బ్యాలెన్స్, బినామీ ఆస్తులు, వారసత్వ రాజకీయాలు అవసరమే లేదన్నారు. ప్రధాని పదవి నుండి దిగిపోయిన వెంటనే జబ్బకు సంచి తగిలించుకుని సామాన్యుడిలా ప్రజా సేవలో తరించే మహనీయుడు మోదీ అని అభివర్ణించారు. మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ  కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి హౌజింగ్ బోర్డు కాలనీ పడవ చౌరస్తా వరకు ‘సేవా జ్యోతి’ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభకు భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీ అధ్యక్షుడు నితిన్ నబిన్ వర్చువల్ గా ప్రసగించి కార్యకర్తలను ఉత్తేజ పరిచారు.  ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి శాంతి కుమార్, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి  కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
:
దేశం కోసం, ప్రజల కోసం 25 ఏళ్ల ప్రజా సేవను గుర్తుగా సేవా జ్యోతి నిర్వహించాం. మోదీ దేశానికి చిరకాలం సేవలందించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రతి పేదింట్లో వెలుగులు నింపడం ద్వారా దేశాభివ్రుద్ధి సాధించేలా మోదీ శ్రమిస్తున్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ నిర్విరామంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ మాటలు విని మోసపోయిన యువకులకు నా విజ్ఝప్తి.
మోదీ రాజకీయ నేపథ్యం, చరిత్ర, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోండి. మోదీ లేని భారత్ ను ఊహించలేం. స్వార్ధం వీడి దేశం కోసం ఆలోచించండి. 2014కు ముందు నేడు భారత్ ఏ విధంగా అభివ్రుద్ధి చెందుతుందో ఆత్మ విమర్శ చేసుకోండి.
మోదీకి సొంత కుటుంబం లేదు దేశ ప్రజలే ఆయన కుటుంబం. ఆయనకు డబ్బులు, బినామీ ప్రాపర్టీలు అవసరమే లేదు. దేశ సేవే ఆయన లక్ష్యం. ప్రధాని పదవి నుండి దిగిపోయినా జబ్బకు సంచి వేసుకుని ప్రజాసేవలో తరించే మహనీయుడు మోదీ. మోదీకి ఆయురారోగ్యాలు అందించాలని సేవా జ్యోతి నిర్వహించాం.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!