ePaper
Friday, October 9, 2026
ePaper
Homeఇంటర్నేషనల్భారతీయులకు ట్రంప్ మరో షాక్...

భారతీయులకు ట్రంప్ మరో షాక్…

📰 Generate e-Paper Clip

భారతీయులకు ట్రంప్ మరో షాక్…

హైదరాబాద్, అక్టోబరు 9 (అర్జున్ సమాచారం డెస్క్)

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ మంజూరు ప్రక్రియలో కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ అవుట్‌సోర్సింగ్ దిగ్గజాలను సస్పెండ్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలతో ఈ కఠిన చర్యలు చేపట్టింది.  జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, కాప్‌జెమినిలతో పాటు ప్రముఖ టెక్ సంస్థలు మైక్రోసాఫ్ట్, అడోబ్ కూడా ఉన్నాయని అమెరికా కార్మిక శాఖ స్పష్టం చేసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని యాంటీ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్ సమక్షంలో వైట్‌హౌస్ వేదికగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై ఈ కంపెనీల నుంచి ఎలాంటి కొత్త పెర్మ్ దరఖాస్తులను స్వీకరించబోమని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నామని వెల్లడించారు.పెర్మ్ ప్రక్రియ అంటే.. అమెరికాలో ఒక కంపెనీ విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డ్ EB-2, EB-3 కేటగిరీలు స్పాన్సర్ చేయాలంటే, మొదటగా కార్మిక శాఖ నుంచి ఈ లేబర్ సర్టిఫికేషన్ పొందడం తప్పనిసరి చట్టబద్ధమైన మొదటి మెట్టు. సదరు ఉద్యోగం చేసేందుకు స్థానికంగా అర్హులైన అమెరికన్ పౌరులు ఎవరూ అందుబాటులో లేరని, విదేశీయుడిని తీసుకోవడం వల్ల అమెరికన్ వర్కర్ల వేతనాలపై ప్రతికూల ప్రభావం పడటం లేదని కంపెనీలు సాక్ష్యాధారాలతో కార్మిక శాఖకు నిరూపించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ ఈ సర్టిఫికేట్‌ను ఆమోదించిన తర్వాతే కంపెనీలు యూఎస్‌సీఐఎస్ వద్ద ఐ-140 పిటిషన్ దాఖలు చేయగలవు. ఇప్పుడు ఈ ప్రధాన మార్గాన్నే నిలిపివేయడంతో, ఈ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల తరఫున కొత్తగా గ్రీన్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించే అర్హతను తాత్కాలికంగా కోల్పోయినట్లయింది.అమెరికా అధికార యంత్రాంగం ఈ కఠిన చర్యకు దిగడానికి హెచ్-1బీ , పెర్మ్ నిబంధనల దుర్వినియోగమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా ఈ దిగ్గజ ఔట్‌సోర్సింగ్ సంస్థలు దాదాపు 30 లక్షల మంది విదేశీ నిపుణుల కోసం దరఖాస్తులు చేశాయని, 2.3 లక్షలకు పైగా హెచ్-1బీ అప్రూవల్స్, లక్షకు పైగా పెర్మ్ సర్టిఫికేషన్లు పొందాయని యూఎస్ కార్మిక శాఖ పేర్కొంది. అమెరికన్ వర్కర్లకు సమాన అవకాశాలు కల్పించకుండా స్థానిక ఉద్యోగాలను కొల్లగొట్టేలా లేబర్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించారని, ఫెడరల్ దర్యాప్తులు ఎదుర్కొంటున్నందున ఈ సస్పెన్షన్ వేటు వేశామని వివరించింది. తాజా చర్యలు అమెరికన్ నిరుద్యోగుల హక్కులను కాపాడేందుకేనని ప్రభుత్వం సమర్థించుకుంది.ఈ నిర్ణయం అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులకు, గ్రీన్ కార్డ్ ఆశావహులకు తీరని ఎదురుదెబ్బగా పరిణమించనుంది. ఈ సంస్థల్లో పనిచేస్తూ ఇప్పటికే పెర్మ్ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ టెక్కీల భవిష్యత్తు ఒక్కసారిగా అనిశ్చితిలో పడింది. కొత్తగా దరఖాస్తులు ఆగిపోవడంతో పాటు, పెండింగ్ ఫైల్స్ కూడా నిలిచిపోవడం వల్ల గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ మరింత తీవ్ర జాప్యానికి గురవుతుంది. ఇది భారత ఐటీ కంపెనీల వ్యాపార కార్యకలాపాలు, ఆన్-సైట్ డిప్లాయ్‌మెంట్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా అధికారులు ఈ కంపెనీల అంతర్గత విధానాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, సస్పెన్షన్‌ను ఎత్తి

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!