ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణరైతుల విద్యుత్ సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

రైతుల విద్యుత్ సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

📰 Generate e-Paper Clip

రైతుల విద్యుత్ సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

మంథని, అక్టోబర్ 9: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 9.

మంథని;రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు మంథని పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మంథని పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో, పెద్దపల్లి కాటారం.రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ .ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సరఫరా సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!