ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు,హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.
న్యూఢిల్లీ: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 9.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం, సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సర్కార్ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

