జన్నారం. మండలం. పొనకల్ గ్రామంలో బతుకమ్మ సంబరాలకు ఏర్పాటు పూర్తి సర్పంచ్ జక్కు సుష్మ. భూమేష్.
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం అక్టోబర్ 9:
జన్నారం మండలం. పొనకల్ గ్రామంలో బతుకమ్మ సంబరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్. జక్కు సుష్మ.భూమేశ్.తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జక్కు సుష్మ.భూమేష్ మాట్లాడుతూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో ఆటపాటలు ఆడుతూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.

