ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణవిద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి .

విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి .

📰 Generate e-Paper Clip

విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి .

అర్జున్ సమాచారం అక్టోబర్ 9 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.

బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు.

అనంతరం కళాశాల విద్యార్థినులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, ముందస్తుగా విజయదశమి, సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల కో-ఎడ్యుకేషన్‌లో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు , పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ ,మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రత్నం సుకుమారి , వైస్ చైర్మన్ రవి పంతులు , అధ్యాపకులు, విద్యార్థులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ వర్ధన్ ,ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!