ePaper
Saturday, October 10, 2026
ePaper
Homeఆరోగ్యంనొప్పి నుంచి ఉపశమనం.. మెరుగైన జీవితానికి భరోసా!పాలియేటివ్‌ సంరక్షణతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు ,ఇప్పటివరకు...

నొప్పి నుంచి ఉపశమనం.. మెరుగైన జీవితానికి భరోసా!పాలియేటివ్‌ సంరక్షణతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు ,ఇప్పటివరకు 600 మందికి ఇంటివద్దే చికిత్స.. ఆసుపత్రిలో 1,500 మందికి వైద్య సేవలు

📰 Generate e-Paper Clip

నొప్పి నుంచి ఉపశమనం.. మెరుగైన జీవితానికి భరోసా!పాలియేటివ్‌ సంరక్షణతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు ,ఇప్పటివరకు 600 మందికి ఇంటివద్దే చికిత్స.. ఆసుపత్రిలో 1,500 మందికి వైద్య సేవలు.

అర్జున్ సమాచారం. అక్టోబర్ 10. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలజిల్లా: అక్టోబర్ 10:ప్రపంచ పాలియేటివ్‌ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని “ప్రపంచ నొప్పి నియంత్రణ.. జీవన నాణ్యతకు భరోసా” అనే నినాదంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్, పాలియేటివ్‌ సంరక్షణ వైద్యులు డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ప్రజారోగ్య ప్రచార అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సంచాలకులు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వ్యాధి ప్రారంభ దశ నుంచే సమగ్ర సంరక్షణ అందించడం పాలియేటివ్‌ వైద్య సేవల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించి నొప్పిని తగ్గించడంతో పాటు రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడం ఈ సేవల ముఖ్య లక్ష్యమని వివరించారు.
క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. వృద్ధులు, నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, దీర్ఘకాలిక శారీరక, మానసిక బాధలు ఎదుర్కొంటున్న వారికి అవసరమైన వైద్య చికిత్సలు, కౌన్సెలింగ్‌ అందిస్తున్నట్లు తెలిపారు.
వైద్యులు, నర్సింగ్‌ అధికారులు, సామాజిక సేవా కార్యకర్తలు, మానసిక ఆరోగ్య నిపుణులతో కూడిన బృందం రోగులకు సమగ్ర సంరక్షణ అందిస్తుందని వివరించారు. రోగులకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు సైతం తగిన సలహాలు అందిస్తూ, ఇంటివద్ద కూడా వైద్య సేవలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. పాలియేటివ్‌ సంరక్షణ బృందం ఇప్పటివరకు ఇంటివద్దకు వెళ్లి 600 మందికి వైద్య చికిత్సలు అందించగా, ఆసుపత్రిలోని బాహ్య, అంతర్గత రోగుల విభాగాల ద్వారా 1,500 మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు.కరుణతో కూడిన సంరక్షణ ప్రతి రోగి హక్కు అని పేర్కొంటూ, ప్రజలు పాలియేటివ్‌ వైద్య సేవల గురించి తెలుసుకుని ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు కోరారు.పాలియేటివ్‌ సంరక్షణ సేవలపై సమాచారం కోసం 7989892078 నంబరును సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్‌ అధికారులు, పాలియేటివ్‌ సంరక్షణ సిబ్బంది, డాక్టర్ వీణ, ఫిజియోథెరపీ సిబ్బంది, ఆరోగ్య విద్యావేత్త అల్లాడి శ్రీనివాస్, ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్, వైద్యులు డాక్టర్ పూర్ణ, డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!