ePaper
Saturday, October 10, 2026
ePaper
Homeతెలంగాణభూగర్భ విద్యుత్..6 వేల కి.మీ.కుపైగా అండర్‌గ్రౌండ్ కేబులింగ్,

భూగర్భ విద్యుత్..6 వేల కి.మీ.కుపైగా అండర్‌గ్రౌండ్ కేబులింగ్,

📰 Generate e-Paper Clip

భూగర్భ విద్యుత్..6 వేల కి.మీ.కుపైగా అండర్‌గ్రౌండ్ కేబులింగ్,

హైదరాబాద్, అక్టోబరు 10, అర్జున్ సమాచారం ప్రతినిధి.

హైదరాబాద్‌లో విద్యుత్ మౌలిక వసతులను మరింత ఆధునికంగా, సురక్షితంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్ చేపట్టింది. TGSPDCL ఆధ్వర్యంలో హైదరాబాద్ భూగర్భ విద్యుత్ కేబులింగ్ ప్రాజెక్ట్ ఫేజ్-1 అమలు కానుంది. ఇందులో సుమారు 311 కిలోమీటర్ల 33 కేవీ, 5,772 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్ లైన్లను భూగర్భంలోకి మార్చనున్నారు. చెట్లు, గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయాలు తగ్గడంతోపాటు వీధుల్లో భద్రత, నగర సౌందర్యం, స్మార్ట్ గ్రిడ్ సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉందని TGSPDCL అధికారులు ట్విట్టర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.ప్రపంచ స్థాయి నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌‌లో విద్యుత్ మౌలిక వసతులను ఆధునీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగరంలో ప్రస్తుతం స్తంభాలపై ఉన్న విద్యుత్ లైన్లను దశలవారీగా భూగర్భంలోకి మార్చే హైదరాబాద్ భూగర్భ విద్యుత్ కేబులింగ్ ప్రాజెక్ట్ ఫేజ్-1ను చేపడుతోంది. తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ  ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అమలు కానుండగా.. నగర విద్యుత్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఫేజ్-1లో సుమారు 311 కిలోమీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్లను, దాదాపు 5,772 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్లను భూగర్భంలోకి తరలించనున్నారు. బంజారాహిల్స్, గ్రీన్‌ల్యాండ్స్, సైఫాబాద్, ప్యారడైజ్, కంటోన్మెంట్, మెహదీపట్నం, చార్మినార్, బేగంబజార్, బోయిన్‌పల్లి, అస్మాన్‌గఢ్, ఆజామాబాద్ డివిజన్లు ఈ తొలి దశలో భాగంగా ఉన్నాయి. బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిళ్ల పరిధిలోని 11 డివిజన్లలో ఈ పనులు చేపట్టనున్నారు. భూగర్భ కేబులింగ్‌తో ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు ఎదురయ్యే అంతరాయాలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం చెట్లు విరిగిపడటం, బలమైన గాలులు, వర్షాలు, పిడుగుల ప్రభావంతో విద్యుత్ లైన్లు దెబ్బతినే సందర్భాలు ఉంటాయి. కేబుళ్లు భూగర్భంలోకి వెళ్లడంతో ఇలాంటి బాహ్య ప్రభావాల నుంచి విద్యుత్ వ్యవస్థకు రక్షణ లభిస్తుంది. ఫలితంగా విద్యుత్ సరఫరాను మరింత స్థిరంగా కొనసాగించేందుకు వీలవుతుందని TGSPDCL అధికారులు వెల్లడించారు.అదే సమయంలో రోడ్ల పక్కన, ఇళ్లకు సమీపంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగ్గడంతో ప్రజల భద్రత కూడా మెరుగుపడనుంది. బాల్కనీలు, ఇళ్లు, ఫుట్‌పాత్‌లకు సమీపంలో ఉన్న ప్రమాదకర విద్యుత్ లైన్ల సమస్య తగ్గడంతో పాటు స్తంభాల సంఖ్య తగ్గడం వల్ల పాదచారులకు మరింత స్థలం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా చారిత్రక ప్రాంతాలు, వారసత్వ కట్టడాల పరిసరాల్లో తీగల గందరగోళం తగ్గడం నగర సౌందర్యాన్ని పెంచే అంశంగా మారనుంది.ఈ ప్రాజెక్ట్‌లో స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. SCADA ఆధారిత రింగ్ మెయిన్ యూనిట్లు అందుబాటులోకి రావడంతో విద్యుత్ నెట్‌వర్క్‌లో లోపాలను వేగంగా గుర్తించి, ప్రభావిత ప్రాంతాన్ని వేరు చేసి సరఫరాను త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. భూగర్భ కేబుళ్లకు అనధికారికంగా కొక్కేలు వేయడం కష్టంగా ఉండటంతో విద్యుత్ చౌర్యం, సాంకేతిక నష్టాలను తగ్గించడంలోనూ ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. మొత్తంగా భూగర్భ కేబులింగ్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన, అందమైన, ఆధునిక విద్యుత్ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దే దిశలో కీలక అడుగుగా నిలవనుంది. భవిష్యత్తులో నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించడం ద్వారా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మరింత పటిష్టమైన నెట్‌వర్క్‌ను నిర్మించే అవకాశం ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!