ePaper
Saturday, October 10, 2026
ePaper
Homeతెలంగాణఅక్టోబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు.రూ.2 వేల వరకు రుసుములు లేవు.. ఆపై...

అక్టోబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు.రూ.2 వేల వరకు రుసుములు లేవు.. ఆపై లావాదేవీలకు ఛార్జీలు

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 15 నుంచి యూపీఐ లావాదేవీలపై కొత్త నిబంధనలు.రూ.2 వేల వరకు రుసుములు లేవు.. ఆపై లావాదేవీలకు ఛార్జీలు.

మంచిర్యాల (అర్జున్ సమాచారం, అక్టోబర్ 10):

యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే చెల్లింపులకు సంబంధించి కొత్త వాణిజ్య నిబంధనలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 2026 అక్టోబర్ 15 నుంచి ప్రాసెస్ చేసే లావాదేవీలకు ఈ సవరించిన నిబంధనలు వర్తించనున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రుసుము వసూలు చేయరు. అయితే రూ.2,000 కంటే ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలపై వ్యాపారుల వర్గీకరణ ఆధారంగా రుసుములు వర్తిస్తాయి.

సాధారణ వ్యాపారులకు లావాదేవీ మొత్తంలో 0.40 శాతం లేదా రూ.300.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తంపై వర్తించే పన్నులు అదనంగా విధిస్తారు. ఎంపిక చేసిన వ్యాపార వర్గాలకు చెందిన వారికి ఒక్కో లావాదేవీపై రూ.5తో పాటు వర్తించే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర వాణిజ్య నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే కొనసాగుతాయని సంబంధిత ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!