ePaper
Saturday, October 10, 2026
ePaper
Homeజగిత్యాలజిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

📰 Generate e-Paper Clip

జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 10::

జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి టోర్నమెంట్ మరియు సెలక్షన్స్–2026–27 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అండర్–14, అండర్–17 బాలబాలికల బాక్సింగ్, తైక్వాండో,కరాటే పోటీలకు జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ హాజరై పోటీలను ప్రారంభించి, క్రీడాకారులను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఆకాంక్షించారు.
సమయం అందరికీ సమానంగా ఉంటుంది అని దాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి ఉత్తమ ఫలితాలు పొందుతారని అన్నారు.
తెలంగాణ క్రీడాకారిణిలు ఆసియా క్రీడల్లో పాల్గొని పతాకాలు సాధించి ఒలంపిక్స్ కు అర్హత సాధించారని,రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివ్రుద్ది కి కృషి చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజంగి నందయ్య మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ కౌన్సిలర్ లు దుమాల రాజ్ కుమార్ ప్రశాంత్ రావు, జుంబర్తి రాజ్ కుమార్,టెక్నికల్ శ్రీను బాబు కరాటే చైర్మన్ లింగయ్య కరాటే ప్రధాన కార్యదర్శి అరుముల్ల పవన్ కార్యదర్శి చక్రధర్
నల్ల నవీన్ సంతోష్ సంపత్ గోదావరిఖానీ శ్రీనివాస్ నాయకులు చందా పృథ్వీ ,శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!