ePaper
Thursday, October 15, 2026
ePaper
Homeతెలంగాణరాజకీయాలకు అతీతంగా బతుకమ్మ మైదానం సిద్ధం,మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్‌రావు చొరవతో మొరం పనులు...

రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ మైదానం సిద్ధం,మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్‌రావు చొరవతో మొరం పనులు పూర్తి,గ్రామస్తుల కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ మైదానం సిద్ధం,మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్‌రావు చొరవతో మొరం పనులు పూర్తి,గ్రామస్తుల కృతజ్ఞతలు.

ముత్తారం, అక్టోబర్ 11, అర్జున్ సమాచారం:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం ముత్తారం గ్రామంలోని కాసర్లగడ్డ–గుండ్లకుంట చెరువు మైదానాన్ని మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్‌రావు చొరవతో చదును చేశారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి మైదానంలో మొరం పోయించి పనులు పూర్తి చేయించారు.

ఆదివారం స్థానిక సర్పంచ్ సుదాటి రవీందర్‌రావుతో కలిసి గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు మైదానాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. బతుకమ్మ వేడుకల కోసం మైదానాన్ని సిద్ధం చేయించిన నాగినేని జగన్మోహన్‌రావుకు గ్రామస్తులు, పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మహిళలకు సౌకర్యాలు కల్పించాలి

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ వేడుకలకు వేలాది మంది మహిళలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. మైదానంలో తాగునీటి సౌకర్యం కల్పించడంతోపాటు రాత్రివేళల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వేడుకలకు వెళ్లే దారిలో అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి మైదానాన్ని సిద్ధం చేయించడం ప్రశంసనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అలుగం రాజేశం, మారం నారాయణరెడ్డి, పెయ్యాల కుమార్, తాటిపాముల శంకర్, గాదం శ్రీనివాస్, వెల్మరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కాశీవోజ్జుల వీరాచారి, కాట్ల రాజయ్య, దయ్యాల కొమురయ్య, గుడి కొండల్‌రెడ్డి, అమ్ము వినోద్‌కుమార్, తిర్నహరి రాజు, బొల్నేని బుచ్చంరావు, కలవేన బాలమల్లు, లక్కాకుల రాజేశం, సాగర్, అమ్ము బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!