ePaper
Tuesday, October 13, 2026
ePaper
Homeతెలంగాణ ఎంపీ వంశీకృష్ణ నిరాధార ఆరోపణలు,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం,

 ఎంపీ వంశీకృష్ణ నిరాధార ఆరోపణలు,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం,

📰 Generate e-Paper Clip

 ఎంపీ వంశీకృష్ణ నిరాధార ఆరోపణలు,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం,

పెద్దపల్లి: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12.

కేంద్ర ఎన్నికల సంఘంపై, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న నిరాధార వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయని బీజేపీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పల్లె సదానంద మాట్లాడుతూ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఓటమి భయంతో నే కాంగ్రెస్ నేతలు ఈవీఎం లు, రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడు తున్న 13 కోట్ల ఓట్ల చోరీ ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపించగల  రా అంటూ సూటిగా ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపీగా గెలిచి 16 నెలలు గడిచినా నియోజకవర్గానికి నయాపైసా తీసుకురాలేద ని, రామగుండం ఎరువుల కర్మాగారం, ఎన్టీపీసీ, రైల్వే లైన్ డబ్లింగ్, నేషనల్ హైవే 363 వంటి అభివృద్ధి పనులన్నీ మోదీ ప్రభుత్వ నిధులతోనే సాధ్యమయ్యా యని స్పష్టం చేస్తూ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమాని సవాల్ విసిరారు.రాముడిని కల్పిత పాత్రగా కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాముడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని,కాకా కుటుంబం పేరు చెప్పుకుని గెలిచిన వంశీకృష్ణ సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాల హామీని ఎందుకు నెరవేర్చలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. స్థానిక సమస్యలను గాలికొదిలేసి ఢిల్లీలో రాహుల్ గాంధీ మెప్పు, ఫోటోల కోసమే సమయం వెచ్చిస్తున్న ఎంపీ వెంటనే ఎన్నికల సంఘానికి, సీఈసీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మోర మనోహర్, పెండ్యాల కుమార్, సంపత్ చారి, కోల సుధాకర్.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!