యాక్సిడెంట్ అయిన కార్మికునికి ,దుబాయ్ లో ఆదుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి.టీ.జీ. డబ్ల్యూ. డబ్ల్యూ. సి.
జన్నారం ప్రతినిధి: డెస్క్ అర్జున్ సమాచారం అక్టోబర్13:
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన గుప మణికంఠ అనే గల్ఫ్ కార్మికుడు దుబాయ్ ఒక కంపెనీలో బైక్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు సాధారణంగా పని భాగంగా బైక్పై వెళ్తున్న మణికంఠ
గత నెల 26న ఒక కారు తొ యాక్సిడెంట్ జరిగి ఎడమ చెయ్యి కీలు మరియు వెనుక విరిగింది. మంచి వైద్యం కోసం ఇండియా వెళ్దామని వెంటనే టికెట్ కొనుక్కొని ఏర్పోర్ట్ కి వెళ్లారు అయితే యాక్సిడెంట్ కేసులో తప్పు మణికంఠది అవడం వలన పోలీసు వారు కేసు ఫైల్ చేసి ట్రావెల్ బ్యాన్ (ప్రయాణ నిషేధం) విధించడం వలన తిరిగి రావడం జరిగింది ఈ విషయం అక్కడే ఉన్న వారి అన్న విజయ్ ద్వారా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి TGWWC వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్యకు తెలియపరిచారు.
భూమయ్య వెంటనే ట్రావెల్ బ్యాన్ కోర్ట్ పరిధిలో ఉన్నందున సమయం పడుతుందని తెలిసి వారి సలహా మేరకు హాస్పిటల్ కి వెళ్లి వారి కంపెనీ మరియు ఇన్సూరెన్స్ సాయంతో వెముక సర్జరీ చేయించగలిగాం అయితే ఇంకా మెరుగైన వైద్యం మరియు రెస్ట్ అవసరము కాబట్టి ట్రావెల్ బ్యాన్ తీసివేయడం కోసం భూమయ్య ఇటు పోలీస్ స్టేషన్, వారి కంపెనీ యజమాన్యం మరియు కోర్టు లకు పలుమార్లు వెళ్లి మాట్లాడి ట్రావెల్ బ్యాన్ మరియు కేసును ఎలాంటి రుసుము లేకుండా తీసి వేయించి మరియు ఇండియాకు రావటానికి విమాన టికెట్ కోసం 800 దరమ్స్ (రూ.20,000 పైన) మా సంస్థ సభ్యుల సహకారంతో కూడా ఇవ్వడం జరిగింది. మణికంఠ నిన్న సాయంత్రానికి, క్షేమంగా ఇంటికి చేరుకోవడం జరిగింది
అన్ని విధాల సహకరించిన దుబాయ్ పోలీస్ మరియు వారి కంపెనీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం
ఈ ప్రక్రియ ఘట్టంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమ్మద్ అలీమ్ కూడా పని చేశారు మరియు విజయ్ (మణికంఠ అన్న) కడెం మండల ఇంచార్జ్ ధర్మాజీ సత్తన్న, బార్ దుబాయ్ కోఆర్డిటర్ కునారపు రమేష్, కల్లెడ నరసయ్య, మేడి రామన్న గుమ్ముల మల్లయ్య సంగిపు నంబయ్య, కోండ్ర కిష్టయ్య, తిరుపతి లు సహకరించడం జరిగింది. వీరిని.టీ.జీ. డబ్ల్యూ. డబ్ల్యూ.సి. సభ్యులు అభినందించారు

