ePaper
Friday, October 16, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం,మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాసిపేటమండల కమిటీ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం,మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాసిపేటమండల కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం,మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాసిపేట
మండల కమిటీ ఎన్నిక,

అర్జున్ సమాచారం అక్టోబర్ 15 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా కాసిపేట: తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు, మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ ముక్త సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కాసిపేట మండల వార్డు సభ్యుల సమావేశం నిర్వహించి, మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా మండల అధ్యక్షునిగా శీడం బాపూరావు , జనరల్ సెక్రటరీగా పల్లపు మహంకాళి ఎన్నుకున్నారు.

మహిళా విభాగం ప్రెసిడెంట్‌గా ఏల్పుల గంగ , మహిళా విభాగం కార్యదర్శిగా శ్రీరాముల అనుష ఎన్నుకోవడం జరిగింది. యూత్ విభాగం అధ్యక్షునిగా ముత్యాల నవీన్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా మాధవి విజయకుమార్ ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ ముక్త సంతోష్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని, వార్డు సభ్యుల హక్కుల సాధన, , సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఫోరం బలోపేతానికి నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులందరూ కృషి చేయాలని కోరారు.

రాష్ట్ర నాయకత్వం ఆశయాలకు అనుగుణంగా, వార్డు సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల స్థాయిలో ఫోరాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!