ePaper
Friday, October 16, 2026
ePaper
Homeతెలంగాణమంచిర్యాలపెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

📰 Generate e-Paper Clip

మంచిర్యాల,అర్జున్ సమాచారం:
మండల తహసిల్దార్ కార్యాలయాలలోని పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి తహసిల్దార్ సిబ్బందితో పలు రెవెన్యూ అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్.- 2026 లో భాగంగా దావాలు అభ్యంతరాల పరిష్కరణ వేగవంతం చేయాలని తెలిపారు కార్యాలయానికి సంబంధించిన పెండింగ్ సర్టిఫికెట్ల,భూ భారతి ద్వారా అందిన దరఖాస్తులు  జి.ఓ.ఎం.ఎస్.నం.59, భూదాన్ భూములకు సంబంధించిన అంశాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత కాల పరిమితిలోగా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ధృవీకరణ పత్రాల కోసం నిరీక్షించకుండా పెండింగ్ సర్టిఫికెట్ల మంజూరుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు
అనంతరం నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఛాంబర్ లో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్ పాండే సూపరింటెండెంట్లు సంబంధిత సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఫైళ్ల పురోగతిపై విభాగాల వారీగా సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఫైలును గడువులోగా పరిష్కరించాలనీ కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించాలని తెలిపారు. కార్యాలయ ఫైల్స్  రికార్డులను పక్కాగా నిర్వహించాలని, రికార్డుల భద్రత నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతి విభాగం సమర్థవంతంగా పని చేయాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!