ePaper
Friday, October 16, 2026
ePaper
Homeతెలంగాణమంచిర్యాలరోబోటిక్ సర్జరీతో 25 ఏళ్ల యువతికి యూరెటరిక్ స్ట్రిక్చర్ చికిత్స...

రోబోటిక్ సర్జరీతో 25 ఏళ్ల యువతికి యూరెటరిక్ స్ట్రిక్చర్ చికిత్స…

📰 Generate e-Paper Clip

మంచిర్యాల :అర్జున్ సమాచారం:
మూత్రం తగ్గిపోవడం, నడుము నొప్పికి కారణమైన కుడి డిస్టల్ యూరెటరిక్ స్ట్రిక్చర్ చికిత్స ద్వారా  కుడివైపు నడుము నొప్పి మూత్రం తగ్గిపోవడం కింది పొత్తికడుపులో నొప్పి మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 25 ఏళ్ల యువతికి మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. పరీక్షల్లో కుడి డిస్టల్ యూరెటరిక్ స్ట్రిక్చర్ ఉన్నట్లు గుర్తించారు దీంతో పాటు కుడివైపు యూరెటర్ విస్తరించి ఉన్నట్లు గుర్తించారు సమస్య ఉన్న ప్రదేశాన్ని పరిగణనలోకి తీసుకుని రోగికి రోబోటిక్ రైట్ యూరెటరిక్ రీ-ఇంప్లాంటేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో కుడి డిస్టల్ యూరెటరిక్ స్ట్రిక్చర్ విస్తరించిన యూరెటర్‌తో పాటు మూత్రాశయం ముందు పొత్తికడుపు గోడ మధ్య అడ్హీషన్స్ ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స అనంతరం ఎలాంటి సమస్యలు లేకుండా కోలుకున్న రోగి హీమోడైనమికల్‌గా స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జి అయ్యారు. డా. యశస్వి రెడ్డి టి. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ యూరో-ఆంకాలజిస్ట్ రోబోటిక్ మరియు రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ మాట్లాడుతూ యూరెటరిక్ స్ట్రిక్చర్ వల్ల మూత్ర మార్గం సంకుచితమై నడుము నొప్పి మూత్రం తగ్గిపోవడం వంటి సమస్యలు రావచ్చన్నారు. ఈ యువతిలో స్ట్రిక్చర్ ఉన్న ప్రదేశాన్ని పరిగణనలోకి తీసుకుని రోబోటిక్ యూరెటరిక్ రీ-ఇంప్లాంటేషన్ నిర్వహించామని తదుపరి ఫాలోఅప్ అవసరమని తెలిపారు. డా. పరిక్షిత్ అనస్థీషియా సేవలు అందించారు మూడు నెలల తర్వాత వైద్యుల క్లినికల్ అంచనా ప్రకారం డీటీపీఏ రీనోగ్రామ్ అవసరం కావచ్చని వైద్యులు సూచించారు. నిరంతరాయంగా నడుము నొప్పి మూత్రం తగ్గిపోవడం లేదా ఇతర మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో యూరాలజిస్ట్‌ను సంప్రదించాలని మలక్ పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలతో కూడిన యూరాలజీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు ఈ కార్యక్రమం లొ వాసుదేవ కిరణ్ యశోద సిబ్బంది పాల్గొన్నారు
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!