ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఓయూలో కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంపై దాడి.. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి.....

ఓయూలో కట్టమైసమ్మ అమ్మవారి ఆలయంపై దాడి.. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి.. లేకుంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: జీవన్ ABVP

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
ఉస్మానియా యూనివర్సిటీలోని మోయిన్ చెరువు సమీపంలో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయ గేట్లను ధ్వంసం చేసి, అమ్మవారి విగ్రహం, హారతి సామగ్రి, గంటలు, నైవేద్య పాత్రలను అపహరించినట్లు
వస్తున్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ అన్నారు.
ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, బాధ్యులను
వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన ఫొటోలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు.
విశ్వవిద్యాలయ
ప్రాంగణంలో దేవాలయాలకు, విద్యార్థుల విశ్వాసాలకు రక్షణ కల్పించడం అధికారుల బాధ్యతని పేర్కొన్నారు. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కట్టమైసమ్మ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటనలో నిందితులను 24 గంటల్లో గుర్తించి అరెస్ట్ చేయకపోతే, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేలాది మంది విద్యార్థులతో డీజీపీ
కార్యాలయాన్ని ముట్టడిస్తామని జీవన్ పోలీసులను హెచ్చరించారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!