కమాన్ పూర్, అర్జున్ సమాచారం:
.
సింగరేణి అధికారుల సంక్షేమానికి సంబంధించిన సీఎంఓఏఐ సమస్యలపై సానుకూలంగా స్పందించి, వాటిని పరిష్కరించే దిశగా విశేష కృషి చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి సీఎంఓఏఐ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అధికారుల దీర్ఘకాలిక, న్యాయమైన డిమాండ్ల విషయంలో మంత్రి చూపిన చొరవ, బొగ్గు బెల్ట్ ప్రాంత అధికారుల పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా తీసుకెళ్లిన తీరుఅభినందనీయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ మేరకు సీఎంఓఏఐ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి. లక్ష్మీపతి గౌడ్ ఆధ్వర్యంలో, ఆర్ జి-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, బి ఈ సి జనరల్ సెక్రటరీ పెద్ది నర్సింహులు, వైస్ ప్రెసిడెంట్, పొనుగంటి శ్రీనివాస్, ఆర్జీ-2 ప్రెసిడెంట్, మాలోత్ రాముడు, ఆర్జీ-3 ఏరియా ప్రెసిడెంట్ కోలా శ్రీనివాస్, ఆర్జీ-2 ఏరియా సెక్రటరీ సంజీవ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ జనార్ధన్, ట్రెజరర్ విశాల్, జాయింట్ ట్రెజరర్ భాస్కర్ రెడ్డి తదితర నాయకులు మరియు అధికారులు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు.ఈ సందర్భంగా మంత్రి కి పుష్పగుచ్ఛం అందజేసి, గజమాలతో ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి, అధికారుల సంక్షేమానికి మంత్రి అందిస్తున్న సహకారం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ, ఈ పరిష్కారం కేవలం ఒక సంఘం విజయం కాదని, ఇది మనందరి సమష్టి విజయం అని వారు తెలియజేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి సన్మానం చేసిన సింగరేణి అధికారులు కమాన్ పూర్
RELATED ARTICLES

