హుజురాబాద్,అర్జున్ సమాచారం:
హుజురాబాద్ మండలం రంగాపూర్ శివారులోని హనుమాన్ స్టోన్ క్రషర్లో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. క్రషర్లో అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
టౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్ శివారులోని హనుమాన్ స్టోన్ క్రషర్లో ఎలాంటి అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు క్రషర్ వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 99 జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించారు. అదేవిధంగా పేలుళ్లకు ఉపయోగించే 100 మీటర్ల వైరు, ఒక కంప్రెసర్ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
స్టోన్ క్రషర్లలో రాళ్లను పేల్చేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాల నిల్వ, రవాణా, వినియోగానికి సంబంధిత అనుమతులు, భద్రతా నిబంధనలు పాటించడం తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘిస్తూ పేలుడు పదార్థాలను నిల్వ చేసినా, రవాణా చేసినా లేదా వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ కరుణాకర్ హెచ్చరించినట్లు తెలిపారు.
పేలుడు పదార్థాల వినియోగం ప్రజల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అక్రమంగా పేలుడు పదార్థాల వినియోగం 99 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు
RELATED ARTICLES

