ePaper
Monday, November 2, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన తేజస్ విద్యార్థి అభిషేక్ ను అభినందించిన...

అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన తేజస్ విద్యార్థి అభిషేక్ ను అభినందించిన కళాశాల చైర్మన్ సతీష్ రావు

📰 Generate e-Paper Clip

కరీంనగర్ (అక్టోబర్ 30),అర్జున్ సమాచారం:
తేజస్ కళాశాలకు చెందిన విద్యార్థి కె.అభిషేక్ అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు.ఇటీవల కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అండర్-19 క్రికెట్ సెలక్షన్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి అభిషేక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.ఈ నెల 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు తరఫున అభిషేక్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.ఈ సందర్భంగా అభిషేక్‌ను కళాశాల చైర్మన్ సతీష్ రావు,క్రికెట్ కోచ్ నరేన్,వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు అభినందించి,రాష్ట్రస్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!