కరీంనగర్ (అక్టోబర్ 30 ):అర్జున్ సమాచారం:
అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సైతం పై చేయి సాధిస్తున్నారు.క్రీడలు విద్యార్థులకు చాలా ఉపకరిస్తాయి.రాష్ట్ర స్థాయి ఉషు పోటీలలో బంగారు పతక వివిధ క్రీడల్లో అత్యధిక సంఖ్యలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక క్రీడల ద్వారా విద్యార్థులకు అనేక లాభాలు చేకురుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.క్రీడలు విద్యార్థులకు చాలా విధాలుగా సహకరిస్తాయని ప్రత్యేకంగా ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలో లోని అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలోని విద్యార్థులు అత్యధిక సంఖ్యలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని మరియు కావలసినటువంటి వనరులు సైతం కల్పించి నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయలచే శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలలో నిర్వహింపబడేటువంటి క్రీడల పోటీలలో పాల్గొనేందుకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని చెప్పారు.అద్భుతమైన విజయాలు నమోదు చేస్తున్నామని మరియు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికవ్వడం చాలా గొప్ప విషయమని వారు చెప్పారు.ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించినటువంటి ఎస్ జి ఎఫ్ జిల్లా స్థాయి అండర్ 19 వివిధ పోటీలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవ్వడం చాలా గొప్ప విషయమని వారు తెలిపారు.ఉషు ఖేలో ఇండియా లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి ఉషు పోటీలలో కళాశాలకు చెందినటువంటి కే.స్నీతిక 45 కిలోల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నదని సంతోషం వ్యక్తం చేశారు మరియు జమ్మూ కాశ్మీర్లో నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనదని చెప్పారు.జిల్లా స్థాయి అండర్ 19-పోటీల విజేతలు & రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎస్.చక్రిత,ఎస్ జి ఎఫ్ ఖో-ఖో ఏం.కార్తీక,ఎస్ జి ఎఫ్ టేబుల్ టెన్నిస్ ఏ.మనస్వి,ఎస్ జి ఎఫ్ హాకీ కే.స్నీతిక,వి అక్షర,కె సాక్షర&ఏ.ఆశ్రిత,ఎస్ జి ఎఫ్ భాస్కెట్ బాల్ రమ్యశ్రీ విజేతలందరికీ పుష్పగుచ్చాలను అందజేసి రాష్ట్రస్థాయిలోనూ అద్భుత ప్రదర్శన కనబరచాలని మరియు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్,అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

