ePaper
Saturday, November 7, 2026
ePaper
Homeతెలంగాణప్రజలే కుటుంబం... ప్రజాసేవే జీవిత లక్ష్యం!

ప్రజలే కుటుంబం… ప్రజాసేవే జీవిత లక్ష్యం!

📰 Generate e-Paper Clip

ప్రజలే కుటుంబం… ప్రజాసేవే జీవిత లక్ష్యం!

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం ఇంటి నుంచే టిఫిన్ బాక్స్.. .వీలున్న చోటే భోజనం ప్రజల మధ్యే నిరంతరం ,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.

మంథని: అర్జున్ సమాచారం నవంబర్.ప్రతినిధి 5.

ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ.. .వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్నారు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌. ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు పరామర్శలు, బాధితులకు భరోసా కల్పించడం వంటి కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడుపుతున్న ఆయన.. వ్యక్తిగత సౌకర్యాల కంటే ప్రజాసేవకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, క్షణం తీరిక లేకుండా పర్యటనలు కొనసాగిస్తున్న పుట్ట మధూకర్‌.. భోజనం కోసం సైతం ప్రత్యేక సమయాన్ని కేటాయించలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఇంటి నుంచే టిఫిన్‌ బాక్స్‌లో భోజనం తీసుకెళ్తూ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడే సాదాసీదాగా భోజనం చేస్తున్నారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా తనదైన నిరాడంబర జీవనశైలితో ప్రజల్లోనే గడుపుతున్నారు.

ఈ క్రమంలో ఆయన సతీమణి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ సైతం భర్తకు అండగా ఉంటూ ప్రజా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా చెట్టు నీడలో కూర్చుని పుట్ట మధూకర్‌ భోజనం చేస్తుండగా, పక్కనే కూర్చుని ఆయనకు పుట్ట శైలజ భోజనం వడ్డిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రజల సమస్యలు వినడం, బాధిత కుటుంబాలను పరామర్శించడం, వారికి అండగా నిలవడం.. ఇవే తన దైనందిన కార్యక్రమాలుగా మార్చుకున్న ఆయన తీరు ఈ దృశ్యంలో ప్రతిబింబిస్తోంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడికి ప్రజలే ప్రథమ ప్రాధాన్యమనే సందేశాన్ని తన నిరంతర పర్యటనల ద్వారా చాటుతున్నారు.

ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం.. మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం.. ఈ క్రమంలో చిన్నపాటి భోజన విరామాన్ని సైతం చెట్టు నీడలోనే ముగించుకుని తిరిగి ప్రజల మధ్యకు వెళ్లడం పుట్ట మధూకర్‌ నిరంతర ప్రజా ప్రయాణానికి నిదర్శనంగా నిలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!