ePaper
Thursday, November 12, 2026
ePaper
Homeతెలంగాణజైపూర్‌లో ప్రజావాణి.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ.

జైపూర్‌లో ప్రజావాణి.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ.

📰 Generate e-Paper Clip

జైపూర్‌లో ప్రజావాణి.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ.

ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి : ఎంపీడీవో శ్రీపతి బాపురావు.

అర్జున్ సమాచారం. 9. నవంబర్.2026.(మంచిర్యాల జిల్లా.)

జైపూర్ మండలం ,సెప్టెంబర్ 09.2016: జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం ఒక ఫిర్యాదు అందగా, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపురావు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ప్రజావాణిలో సమర్పించి పరిష్కారం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి. శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సైదా, పశువైద్య సహాయ శస్త్రవైద్యుడు డాక్టర్ ఏ. వెంకటేష్, పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజినీర్ బి. రాజ్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా శాఖ సహాయ ఇంజినీర్ ఎన్. రాజమల్లయ్య, ఐకేపీ సమన్వయకర్త శంకర్, గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజినీర్ కాంక్ష, గ్రామీణ ఉపాధి హామీ పథకం అదనపు కార్యక్రమ అధికారి బి. బాలయ్య, నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణ శాఖకు చెందిన ఎస్. శ్రీకాంత్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సుధాలక్ష్మి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!