ePaper
Thursday, November 12, 2026
ePaper
Homeతెలంగాణమాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన కందుల సంధ్యారాణి పోశం.

మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన కందుల సంధ్యారాణి పోశం.

📰 Generate e-Paper Clip

మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన కందుల సంధ్యారాణి పోశం.

అర్జున్ సమాచారం .నవంబర్ 11. రామగిరి రిపోర్టర్.

రామగిరి మండలం బుధవారం పేట (రామయ్యపల్లి) గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క–కొమురయ్య గౌడ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కొమురయ్య గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్‌ల మాతృమూర్తి గట్టు మల్లమ్మ ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పోశం వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా గట్టు మల్లమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడు దుండే మల్లేశం, లసెట్టి చంద్రమౌళి, రాజాపూర్ మాజీ ఉపసర్పంచ్ ఉగ్గే కుమార్, పెరిక సంఘం నాయకులు బత్తుల రమేష్, దుండే రాజేందర్, బియ్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!