ePaper
Monday, November 9, 2026
ePaper
Homeతెలంగాణరాజాపూర్‌లో బస్‌షెల్టర్‌ కరువు.. ప్రయాణికుల అవస్థలు.

రాజాపూర్‌లో బస్‌షెల్టర్‌ కరువు.. ప్రయాణికుల అవస్థలు.

📰 Generate e-Paper Clip

రాజాపూర్‌లో బస్‌షెల్టర్‌ కరువు.. ప్రయాణికుల అవస్థలు.

మంథని:అర్జున్ సమాచారం నవంబర్ 9 రామగిరి రిపోర్టర్.

రూ.25 కోట్లతో రోడ్డు నిర్మించినా అందని ప్రయాణికుల సౌకర్యాలు,

ఐదారు నెలలుగా బస్‌షెల్టర్‌ లేక ప్రజల ఇబ్బందులు వెలగని సెంట్రల్‌ లైటింగ్‌.. తరచూ ప్రమాదాలు సింగరేణి యాజమాన్యం, గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శలు.

మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై ఉన్న రాజాపూర్ గ్రామంలో బస్‌షెల్టర్‌ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు కనీసం నిలబడేందుకు నీడ కూడా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

    సింగరేణి యాజమాన్యం సుమారు రూ.25 కోట్ల వ్యయంతో నూతన రహదారిని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే రహదారి నిర్మాణం పూర్తయి ఐదారు నెలలు గడుస్తున్నా ప్రయాణికులకు అవసరమైన బస్‌షెల్టర్‌ ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్‌షెల్టర్‌ నిర్మించాలని గ్రామపంచాయతీ సర్పంచ్‌, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. అటు సింగరేణి యాజమాన్యం సైతం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    మరోవైపు నూతన రహదారి మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసినప్పటికీ లైట్లు వెలగకపోవడంతో రాత్రివేళ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రజలు గాయాలపాలవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

    ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి రాజాపూర్‌లో వెంటనే బస్‌షెల్టర్‌ నిర్మించాలని, సెంట్రల్‌ లైటింగ్‌ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మంథని నియోజకవర్గ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రాజాపూర్ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    - Advertisment -
    App Icon

    Install AS News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!