గచ్చిబౌలి,అర్జున్ సమాచారం:
రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ శిల్పా వ్యాలీలోని సారా ప్రైడ్ అపార్ట్మెంట్లో ఈ నెల 2వ తేదీన చోరీ జరిగింది.
ఫ్లాట్ నంబర్ 502లో ఎవరూ లేని సమయంలో టెర్రస్‌పై నుంచి తాడు సహాయంతో బాల్కనీలోకి దిగిన నిందితుడు.. స్లైడింగ్ డోర్, అల్మారాను ధ్వంసం చేసి సుమారు 35 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులను దొంగిలించాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి క్రైమ్ టీమ్.. నాలుగు రోజుల్లోనే నిందితుడిని గుర్తించి, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్స్ వద్ద అదుపులో కి తీసుకున్నారు .
నిందితుడిని బోరబండకు చెందిన 28 ఏళ్ల లిమ్మక అనంత్ కుమార్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు హోండా యాక్టివా స్కూటర్, మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Dafa Bet యాప్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడిన నిందితుడు.. ఆర్థిక అవసరాల కోసం ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలింది.
నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. కేసులో తదుపరి దర్యాప్తు చేస్తున్నారు .
గచ్చిబౌలిలో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
RELATED ARTICLES

