ePaper
Monday, November 9, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్దళిత సర్పంచ్ కుటుంబంపై కులం పేరుతో దూషణలను ఇక ముందు సహించేది లేదు.

దళిత సర్పంచ్ కుటుంబంపై కులం పేరుతో దూషణలను ఇక ముందు సహించేది లేదు.

📰 Generate e-Paper Clip

దళిత సర్పంచ్ కుటుంబంపై కులం పేరుతో దూషణలను ఇక ముందు సహించేది లేదు.

మంథని:అర్జున్ సమాచారం నవంబర్ 9 .రామగిరి రిపోర్టర్.

24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలి ,మాదిగ యువశక్తి ఫౌండర్, చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ వాసు.
దళిత సర్పంచ్ కన్నూరి రాజబాబు, ఆయన కుటుంబ సభ్యులపై కులం పేరుతో దుర్భాషలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ యువశక్తి కోర్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మంథని మండలం పుట్టపాక ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని మాదిగ యువశక్తి కోర్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు, దళిత సంఘాల నాయకులు పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మాదిగ యువశక్తి ఫౌండర్, చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ వాసు మాట్లాడుతూ.. పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి అభిరామ్ విద్యాధర్ ఆదివారం సాయంత్రం మంథని నుంచి బైక్‌పై వస్తుండగా పోరెడ్డి తిరుపతి రెడ్డి, వీరారెడ్డి, కన్నూరి తిరుపతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదకరంగా ఢీకొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ విషయంపై పుట్టపాకలో తమ బంధువైన కన్నూరి తిరుపతిని ప్రశ్నించగా, పోరెడ్డి తిరుపతి రెడ్డి ఫోన్ లాక్కొని కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించారని బాధితులు తమకు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేశారు.

సీనియర్ న్యాయవాదులు బూడిద మల్లేష్, పెద్దెల్లి ప్రకాష్ మాట్లాడుతూ.. గతంలో రౌడీషీట్ కలిగి ఉన్నారని పేర్కొంటున్న పోరెడ్డి తిరుపతి రెడ్డిపై పోలీసులు తక్షణమే స్పందించి 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ సామాజిక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసే చర్యలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ కుల వివక్ష కొనసాగడం విచారకరమన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు.

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి పోలీసు శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఘటనకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాదిగ యువశక్తి ఫౌండర్, చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్ వాసు, సీనియర్ న్యాయవాదులు బూడిద మల్లేష్, పెద్దెల్లి ప్రకాష్, అడ్వకేట్ అడ్వైజర్ ఆసంపల్లి రవి, అడ్వకేట్ ఇరుగురాల సంతోష్, గడ్డం సునీల్ కుమార్, సీనియర్ దళిత నాయకులు, రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి బూడిద రాజన్న, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!