(మంథని ):
అర్జున్ సమాచారం:
మంథని గోదావరి నది నుండి అంగుళూరు శివారు వరకు ఫోర్ వే లైన్ రోడ్డు పనులకు సర్వేపల్లి మంగళవారం మంథని తహసిల్దార్ ఆరిఫోద్దీన్ నిర్వహించారు. గోదావరి నదిపై 260 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జ్ నుండి మంథని, విలోచవరం, కూచిరాజు పల్లి, అంగుళూరు శివారు వరకు 120 ఫీట్లతో ఫోర్ వే లైన్ రోడ్డు నిర్మించనున్నారు. ఇందుకుగాను మంథని శివారులో 33 ఎకరాల 18 గుంటలు, విలోచవరంలో 9.4, కూచిరాజుపల్లిలో 16.33 మొత్తం 79 ఎకరాల భూమిని రైతులను సేకరించినున్నట్లు ఎమ్మార్వో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవోల ఆదేశాల మేరకు రైతుల సమక్షంలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంథని ప్రాంత అభివృద్ధికి తమ పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా సర్వేలో పాల్గొన్న రైతులు మూల పురుషోత్తం రెడ్డి, ఎక్కేటి అనంతరెడ్డి, లోకే మనోహర్, మహా వాది విజయకుమార్, లోకే శరత్, వెంకట్ రెడ్డి, గట్టు కృష్ణ లు తెలిపారు. మంథని గోదావరి నది నుండి శివ్వారం కు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే మంథని ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ పూర్తిగా మద్దతుగా ఉంటామని వారు తెలిపారు. ఈ సర్వే కార్యక్రమంలో జిపిఓ శివకుమార్, రైతులు పాల్గొన్నారు.
ఫోర్ వే లైన్ రోడ్డు పనులకు సర్వే — మంథని ఎమ్మార్వో ఆరిఫోద్దీన్
RELATED ARTICLES

