ePaper
Monday, November 16, 2026
ePaper
Homeతెలంగాణవిద్యుత్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన కే. సంతోష్ రెడ్డి...

విద్యుత్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన కే. సంతోష్ రెడ్డి…

📰 Generate e-Paper Clip

విద్యుత్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన కే. సంతోష్ రెడ్డి…

అర్జున్ సమాచారం నవంబర్ 16 ,రామగిరి రిపోర్టర్.

రత్నాపూర్ సబ్‌స్టేషన్‌లో సెల్‌ఫోన్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ వినతి.

సెంటినరీ కాలనీ: రామగిరి మండల విద్యుత్ శాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్ ఇంజనీర్‌ (ఏఈ)గా కే. సంతోష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రత్నాపూర్ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ కార్యాలయంలో మంథని విద్యుత్ డీఈ వి. ప్రభాకర్ సమక్షంలో ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం విద్యుత్ శాఖ సిబ్బంది డీఈ ప్రభాకర్, ఇన్‌చార్జి ఏఈ సంతోష్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ముత్తారం ఏఈ రాజేందర్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ మౌలానా, లైన్ ఇన్‌స్పెక్టర్లు ఉడుత భూమయ్య, నవీన్, లైన్‌మెన్లు బండారు శివకుమార్, రాజేందర్, ఆకుల శ్రీనివాస్, రమేష్, ఏఎల్‌ఎంలు ఈశ్వర్, రాజు, కృష్ణమాచారి, బండి శ్రీనివాస్, రాకేష్, కాంట్రాక్టర్లు గుండ రాధయ్య, చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌లో సెల్‌ఫోన్ ఏర్పాటు చేయాలి.

రత్నాపూర్ సబ్‌స్టేషన్‌లో సెల్‌ఫోన్ ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు విద్యుత్ శాఖ డీఈ వి. ప్రభాకర్‌ను కోరారు. సబ్‌స్టేషన్‌కు వచ్చిన డీఈకి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సబ్‌స్టేషన్‌లో ఫోన్ సౌకర్యం లేకపోవడంతో విద్యుత్ సమస్యలపై సిబ్బందిని సంప్రదించేందుకు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనిపై స్పందించిన డీఈ త్వరలోనే సబ్‌స్టేషన్‌లో సెల్‌ఫోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!