ePaper
Wednesday, November 18, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంరష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి!

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి!

📰 Generate e-Paper Clip

రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి!
సైబీరియాలో కుప్పకూలిన సైనిక రవాణా విమానం.. గాల్లోనే మంటలు.. సాంకేతిక లోపమే కారణమని ప్రాథమిక అంచనా,

హైదరాబాద్, నవంబర్ 18 , అర్జున్ సమాచారం ప్రతినిధి.

రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో రష్యాకు చెందిన అంటోనోవ్ ఏఎన్‌-12 సైనిక రవాణా విమానం మంగళవారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో,

విమానంలో ఉన్న మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తొలుత 17 మంది మృతి చెందినట్లు వార్తలు వెలువడగా, అనంతరం మృతుల సంఖ్య 19గా అధికారికంగావెల్లడైంది.రాత్రి 9.30 గంటల సమయంలో ప్రమాదం?

నవంబర్ 17, మంగళవారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో కెమెరోవో ప్రాంతంలోని యగునోవో గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రాంతీయ గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ విమాన వెల్లడైంది.రాత్రి 9.30 గంటల సమయంలో ప్రమాదం?

ప్రమాదాన్ని ధ్రువీకరించారు. విమానం జనావాసాలకు దూరంగా ఓ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.గాల్లో మంటలు.. నేలపై భారీ పేలుడు

విమాన ప్రమాదానికి ముందు విమానంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి. మంటలతో విమానం వేగంగా కిందకు దూసుకొచ్చి నేలను ఢీకొన్నట్లు సమాచారం. ప్రమాదం,

జరిగిన వెంటనే సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువ‌చ్చారు. .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!