ePaper
Wednesday, November 18, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్నిమ్స్ వ్య‌వ‌హారంలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు.

నిమ్స్ వ్య‌వ‌హారంలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు.

📰 Generate e-Paper Clip

నిమ్స్ వ్య‌వ‌హారంలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు.

హైద‌రాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18.

నిమ్స్ అక్రమాల కేసులో  సంచలన విషయాలు  వెలుగులోకి  వ‌చ్చాయి. నిమ్స్ టెండర్లు లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ  గుర్తించింది.  కోవిడ్ సమయంలో బెడ్లు కేటాయింపుల్లో లక్షల

రూపాయలు వసూళ్లు చేసినట్లు గుర్తించారు.  కోవిడ్ లో ఒక్కో బెడ్ కి లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ  విచారణ లో నిర్దారించారు.  నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ ,ప్రశాంత్ తో కలిసి అక్రమాలు చేసినట్లు గుర్తించారు.

క్యాంటీన్లు, మెడికల్ షాప్స్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ టెండర్ల లలో  అవకతవకలు జరిగినట్లు,  కోవిడ్ లో బెడ్ కోసం సుగుణమ్మ అనే మహిళ దగ్గర లక్ష లంచం తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు.  

ఈ వ్యవహారం లో పంజాగుట్ట పీఎస్ లో కేసు, రికార్డ్ లో  వేయి మాత్రమే చెల్లించినట్లు  నిమ్స్ అధికారులు చూపించారు. ప్రశాంత్ నిమ్స్ ఉద్యోగి కాకపోయిన  బెడ్లు కేటాయింపులో కీలక పాత్ర  వ‌హించాడు.

లక్ష్మీ భాస్కర్ ఆస్తుల కొనుగోలు సమయంలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే  భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!